శ్రీలంక మాజీ క్రికెటర్ అరెస్ట్ .. కారణం ఇదే

by velandi.Saikiran |

శ్రీలంక మాజీ క్రికెటర్ రమిత్ రాంబుకువెల్లకు ( Ramith Rambukwella ) ఊహించని షాక్ తగిలింది. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్

శ్రీలంక మాజీ క్రికెటర్ అరెస్ట్ .. కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక మాజీ క్రికెటర్ రమిత్ రాంబుకువెల్లకు ( Ramith Rambukwella ) ఊహించని షాక్ తగిలింది. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ రమిత్ రాంబుకువెల్ల ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో... ఈ అరెస్టు జరిగినట్లు సమాచారం అందుతుంది. మొదట అరెస్టు చేసిన శ్రీలంక పోలీసులు ( Srilanka polices).. మాజీ క్రికెటర్ రమిత్ రాంబుకువెల్ల కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కొలంబో కోర్టులో శ్రీలంక మాజీ క్రికెటర్ రమిత్ ను హాజరపరిచారు.

ఈ నేపథ్యంలోనే విచారణ చేసిన కొలంబో కోర్టు... 14 రోజుల రిమాండ్ విధించింది. క్రికెటర్ రమిత్ తండ్రి కెహెలియా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఓ కేసులో లంచం తీసుకున్నట్లు.. పక్కా సమాచారంతో ఎటాక్ చేసి పట్టుకున్నారు. అయితే ఇందులో కుమారుడు.. శ్రీలంక మ్యాజిక్ క్రికెటర్ రమిత్ కూడా ఉన్నట్లు తాజాగా తేలింది. దీంతో తాజాగా అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలోనే రమిత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

Next Story