ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత్ పతకాల పంట..ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం

by Malleboina Mahesh |

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత షూటర్లు సంచలన ప్రదర్శనతో స్వర్ణం, కాంస్య పతకాలను సాధించారు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత్ పతకాల పంట..ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం
X

దిశ, వెబ్ డెస్క్: ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ISSF) రైఫిల్/పిస్టల్/షాట్‌గన్ ప్రపంచ కప్‌లో భారత షూటర్లు సంచలన ప్రదర్శనతో పతకాల వేట కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు డబుల్ పోడియం ఫినిష్ దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల షూటర్ ఈషా సింగ్ (Isha Singh) ఆధిపత్యం ప్రదర్శించి, ఏకంగా 40 హిట్స్‌తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఒలింపిక్ పతక విజేత మను భాకర్ (Manu Bhaker) తీవ్ర పోటీ నడుమ కీలక షూట్-ఆఫ్‌ను గెలుచుకుని, 28 హిట్స్‌తో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

అంతకుముందు జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే భారత షూటర్లు తమ అత్యుత్తమ ప్రతిభతో ఆధిపత్యాన్ని చాటారు. మను భాకర్ 586-20x అత్యుత్తమ స్కోరుతో క్వాలిఫైయింగ్ పట్టికలో అగ్ర స్థానంలో నిలవగా, ఈషా సింగ్ 585-18x స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుని ఎనిమిది మంది షూటర్ల ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. ఫైనల్లో సైతం తమ స్థానాలను పటిష్టం చేసుకుంటూ భారత్‌కు పతకాల పంట పండించడంతో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story