- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత స్టార్ క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్
దేశవాళీలో కచ్చితంగా పాల్గొనాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు ఇటీవల రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు.

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీలో కచ్చితంగా పాల్గొనాల్సిందేనన్న బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు ఇటీవల రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించగా.. దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే భారత స్టార్ క్రికెటర్లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోకుండా ఉండాలనే వారు ఆడినట్టు ఉంది తప్ప వారి మనసు ఆటపై లేదని విమర్శించాడు.
‘బీసీసీఐ, కోచ్ పట్టుబట్టడం వల్ల చాలా మంది ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడారు. కానీ, వారి ఆట చూశాక వారి మనసు అక్కడ లేదేమో అన్న అనుమానం వచ్చింది. గతేడాది రంజీ ట్రోఫీ ఆడనందుకు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ల కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. భారత స్టార్ ప్లేయర్లు కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోకుండా ఉండేందుకే రంజీ మ్యాచ్ ఆడారమో అనిపిస్తుంది.’ అని తెలిపాడు.
అలాగే, ముంబై జట్టు తరపున గత మ్యాచ్‌లో రాణించిన శార్దూల్ ఠాకూర్, తనుష్ కొటియన్‌ను ప్రశంసించాడు. శార్దూల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(51, 119) అద్భుతమైన బ్యాటింగ్ చేశాడని, తనుష్ చక్కటి ఆటతీరు ప్రదర్శించాడని చెప్పాడు. వారిని చూసి నేర్చుకోవాలని హితువు పలికాడు. జాగ్రత్తగా, దూకుడుగా ఆడితేనే పరుగులు సాధించొచ్చని, శార్దూల్, తనుష్ అదే చేశారని చెప్పుకొచ్చాడు.






