ENG vs IND: రెచ్చిపోయిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్‌ ఆలౌట్

by Gantepaka Srikanth |

లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరుగుతోన్న ఐదో టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్‌‌ను 247 పరుగులకే కట్టడి చేయగలిగారు.

ENG vs IND: రెచ్చిపోయిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్‌ ఆలౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరుగుతోన్న ఐదో టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్‌‌ను 247 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఓవరాల్‌గా పది వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. 247 పరుగులు చేసి.. భారత్ ఎదుట 23 పరుగుల లీడ్ పెట్టింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ (64), డకెట్ (43), బ్రూక్ (53), రూట్ (29), పోప్ (23) తప్ప ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా కూడా ఆలౌట్ అయింది. స్వల్ప 224 పరుగులకే అందరూ చేతులెత్తేశారు. భారత బ్యాటర్లలో కరుణ్ నాయక్ (57), సాయి సుదర్శన్ (38), సుందర్ (26), గిల్ (22) తప్ప ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్‌ ఐదు వికెట్లు, జోష్ టంగ్ మూడు వికెట్లు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశారు.

Next Story