- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లాండ్@5లక్షల పరుగులు.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 1082 టెస్ట్‌లు ఆడిన ఇంగ్లాండ్ శనివారం న్యూజిలాండ్‌తో సెకండ్ టెస్టు రెండో రోజు 5లక్షల పరుగుల మైలురాయిని అందుకుంది. టెస్ట్ క్రికెట్‌లో 929 సెంచరీలతో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన జట్టుగా సైతం ఇంగ్లాండ్ టాప్‌లో ఉంది. 717 క్రికెటర్లు, 18,900ల వ్యక్తిగత ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఇంగ్లాండ్ ఫీట్ సాధించింది. 4,29,000 పరుగులతో ఆస్ట్రేలియా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. భారత్ 586 టెస్ట్‌లు ఆడి 2,78,751 పరుగులు చేసి మూడో స్థానంలో ఉంది. వెస్టిండీస్ 582 మ్యాచ్‌ల్లో 2,70,429 పరుగులతో తర్వాతి స్థానంలో ఉంది.
పట్టుబిగిస్తోన్న ఇంగ్లాండ్
ఇక సెకండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 378/5 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు 533 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 125 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ 280 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్(92), జాకబ్ బెథెల్ (96) పరుగులు చేసి రాణించారు. జోరూట్ 73, బెన్ స్టోక్స్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఇంగ్లాండ్ తొలి మ్యాచ్‌ను గెలిచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ సొంతం కానుంది.






