- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్, విరాట్ లేకుండా ఫస్ట్ టెస్ట్.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్
భారత్(India) - ఇంగ్లండ్(England) మధ్య లీడ్స్ మైదానం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - ఇంగ్లండ్(England) మధ్య లీడ్స్ మైదానం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు.. బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి టెస్టు ఇదే కావడం గమనార్హం. బూమ్రా, జడేజా, రాహుల్ మినహా అంతా కుర్రాళ్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. మరోవైపు.. గిల్ జట్టును ఎలా ముందుకు నడిపించబోతున్నాడో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరుజట్ల మధ్య తొలి పోరు జరగనుంది. గత తొమ్మిది దశాబ్దాలలో 1971లో అజిత్ వాడేకర్ బ్యాచ్, 1986లో కపిల్ డెవిల్స్, 2007లో రాహుల్ ద్రవిడ్ బృందం మాత్రమే ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌లు గెలిచాయి. ఆ తర్వాత ఏ జట్లూ ఈ ఘనత సాధించలేదు. గత పదేళ్లలో ఇండియా టెస్ట్ టీమ్‌కు ఐకాన్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో అతిపెద్ద శూన్యం ఆవరించింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఆసక్తి పెరుగుతోంది. ఎవరు పైచేయి సాధిస్తారో అని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.






