T20World Cup2026: మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్‌.. మనసులు గెలిచిన నేపాల్

by Gantepaka Srikanth |

టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇంగ్లాండ్, నేపాల్ మ్యాచ్ జరిగింది.

T20World Cup2026: మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్‌.. మనసులు గెలిచిన నేపాల్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇంగ్లాండ్, నేపాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది. హారీ బ్రూక్, జకాబ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. విల్ జాక్స్ 39 పరుగులతో చివర్లో మెరుపులు మెరిపించారు. దీంతో ఇంగ్లాండ్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. నేపాల్ బౌలర్లో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో రెండేసి వికెట్లు తీయగా, షేర్ మల్లా, సందీన్ తలో వికెట్ తీశారు.

185 పరుగుల లక్ష్య చేధనలో బ్యాటింగ్ వచ్చిన నేపాల్ ఆటగాళ్లు.. ఇంగ్లాండ్ బౌలర్లకు చెమటలు పట్టించారు. మైదానంలో ఉన్న అభిమానులంతా ఇంగ్లాండ్ పనైపోయింది. నేపాల్ విజయం ఖరారైపోయిందని భావించారు. చివరి వరకు ఎక్కడా లైట్ తీసుకోకుండా నేపాల్ బ్యాటర్లు రాణించారు. కానీ చివరకు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కేవలం నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. నేపాల్ బ్యాటర్లలో కుషాల్ 29, రోహిత్ 39, దీపేంద్ర సింగ్ 44, లోకేష్ 39 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ రెండు వికెట్లు తీయగా, వుడ్, ఆర్చర్, విల్ జాక్స్, సామ్ కరణ్ తలో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో విజయం కోసం విరోచితంగా పోరాడిన నేపాల్ జట్టును అందరూ ప్రశంసించారు. ఇవాళ్టి మ్యాచ్‌లో జరిగిన మిస్టేక్స్‌ను నెక్ట్స్ మ్యాచ్‌లో కరెక్ట్ చేసుకుంటే తప్పకుండా విజయం సాధించొచ్చని అభినందిస్తున్నారు.

Next Story