- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
World Cup 2025: భారత్‌కు హ్యాట్రిక్ ఓటమి.. ఉత్కంఠ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం
by Gantepaka Srikanth |
అత్యంత కీలకమైన వరల్డ్ కప్(ICC Womens World Cup 2025)లో టీమిండియా(Team India) మహిళల జట్టు వరుసగా నిరాశ పర్చుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అత్యంత కీలకమైన వరల్డ్ కప్(ICC Womens World Cup 2025)లో టీమిండియా(Team India) మహిళల జట్టు వరుసగా నిరాశ పర్చుతోంది. టోర్నమెంట్ స్టార్టింగ్‌లో దూకుడు ప్రదర్శించినా.. ఆ తర్వాత క్రమంగా నిరాశ పర్చుతూ వస్తోంది. తాజాగా మరోసారి ఓటమి పాలైంది. ఆదివారం ఇంగ్లాండ్(England)తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పోరాడి ఓడింది. హర్మన్‌ప్రీత్ సేనపై ఇంగ్లాండ్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 284 రన్స్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), దీప్తి శర్మ (50) రాణించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.
Next Story






