- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs ENG: నేడే తొలి టీ20 మ్యాచ్.. మ్యాచ్ టైమింగ్స్ ఇవే
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో... మహిళలు కూడా.. ఇంగ్లాండ్ మహిళల

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో... మహిళలు కూడా.. ఇంగ్లాండ్ మహిళల జట్టుతో తలపడబోతున్నారు. ఇవాల్టి నుంచి టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ తొలి టి20 జరగనుంది.
నాటింగ్ హమ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా ఉమెన్స్ జట్టుకు... ఈ సంవత్సరంలో ఇదే మొదటి టీ20 సిరీస్ కావడం గమనార్హం. వచ్చే సంవత్సరం టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో... ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ టి 20 సిరీస్ సోనీ లివ్ లో చూడవచ్చు.
ఇరు జట్లు
ఇంగ్లాండ్ : డాని వ్యాట్-హాడ్జ్, సోఫియా డంక్లీ, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), పైజ్ స్కోల్‌ఫీల్డ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఆలిస్ కాప్సే, ఎమ్ ఆర్లాట్, చార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లిన్సే స్మిత్, లారెన్ బెల్
భారత్ : స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (C), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్






