- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lords Test : లార్డ్స్ టెస్ట్‌లో రచ్చ..వేలు చూపిస్తూ గిల్ వార్నింగ్..!
టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ చాలా హాట్ హాట్ గా

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ చాలా హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఇరుదట్ల ప్లేయర్ల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. ముఖ్యంగా మూడవ రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ప్లేయర్లతో గొడవకు దిగాడు టీమిండియా కెప్టెన్ గిల్ ( Gill). దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లార్డ్స్ టెస్ట్ ( Lords Test) మూడవరోజు ముగిసే సమయానికి... బ్యాటింగ్ కు దిగింది ఇంగ్లాండు టీం. ఈ సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా ( Bumrah) బౌలింగ్ చేశాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు క్రాలీ... పదేపదే ఇబ్బంది పెట్టాడు. మ్యాచ్ ఆలస్యం చేసేలా.. వ్యవహరించాడు. మూడవరోజు మరొక ఓవర్ పడుతుందని... అందరూ అనుకుంటే.. ఒకే ఓవర్ కు ముగిసేలా ఇంగ్లాండ్ ప్లేయర్లు కుట్రలు చేశారు.
బుమ్రా వేసిన తొలి ఓవర్ లోనే చాలా సార్లు క్రాలీ... విసుగు తెప్పించాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ గిల్ చాలా సీరియస్ అయ్యాడు. వేలు చూపిస్తూ.. వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు గిల్. అతడికి తోడు సహచరులు కూడా క్రాలీని ఒక ఆట ఆడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా మూడవరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు ఒకే ఒక్క ఓవర్ ఆడి రెండు పరుగులు మాత్రమే చేసింది.
Twitter link
Gill to Crawley: 'Grow some balls, mate!' as India claps back with fire! 🤣🔥
— Virat Kohli Fan Page (@TeamAvinashOFC) July 12, 2025
Also Indian team is clapping for this epic drama performance #ENGvINDTest #INDvsENDpic.twitter.com/ckwTGEI8O0 pic.twitter.com/GvWPfXkMxv






