Ind vs Eng: కష్టాల్లో టీమిండియా... స్కోర్ ఎంతంటే?

by velandi.Saikiran |   (  Updated:2025-07-02 16:41:52  IST  )

ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య ఇవాళ మధ్యాహ్నం రెండో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే

Ind vs Eng: కష్టాల్లో టీమిండియా... స్కోర్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య ఇవాళ మధ్యాహ్నం రెండో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఎప్పటిలాగే ఒకరో ఇద్దరో.. అద్భుతంగా ఆడగా మిగిలిన... ప్లేయర్లందరూ... దారుణంగా విఫలమయ్యారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ మ్యాచ్ ఎడ్జ్ బస్టన్ వేదిక గా జరుగుతోంది. అయితే ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ అదరగొడుతుంది. అటు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇప్పటి వరకు 68 ఓవర్లు ఆడింది.

ఈ నేపథ్యంలో 243 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది టీమిండియా. మొదటి ఇన్నింగ్స్ లో యశస్వి జైష్వాల్ (Yashasvi Jaishwal) 87 పరుగులు చేయగా, గిల్ ( Shubhaman Gill) 77 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు మినహా ఏ ఒక్క ఆటగాడు మెరవలేదు. కేఎల్ రాహుల్ ( Kl Rahul) రెండు పరుగులకే వెనుతిరిగాడు. కరుణ్ నాయర్ ( Karun Nair) 31 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. ఇది రిషబ్ పంత్ 25 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. ఒకే ఒక పరుగు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది.

Next Story