- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచిన ఇంగ్లాండ్..కొత్త ప్లేయర్స్ తో బరిలోకి గిల్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండో టెస్ట్ ఎడ్జ్

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండో టెస్ట్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ... కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
దీంతో టీమిండియా ఇవాల్టి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేయబోతోంది. అయితే రెండో టెస్ట్ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు బుమ్రా ఆడటం లేదు. అతని స్థానంలో జట్టులోకి ఆకాష్ దీప్ ను దించారు. ఈ రెండు టెస్ట్ కోసం మొత్తం ముగ్గురు కొత్త ప్లేయర్లను బరిలోకి దింపారు గిల్. వాషింగ్టన్ సుందర్, నితీష్ , ఆకాష్ ఇవాళ్టి మ్యాచ్ లో ఆడుతున్నారు. మొదటి టెస్టు ఓడిన బాధలో ఉన్న టీమిండియా... బుమ్రా లేకున్నా కూడా గెలవాలని ప్లాన్ చేస్తోంది. మరి ఈ రెండో టెస్టులో ఆయన టీమిండియా రాణిస్తుందో లేదో చూడాలి.
ఇంగ్లండ్: 1 జాక్ క్రాలీ, 2 బెన్ డకెట్, 3 ఆలీ పోప్, 4 జో రూట్, 5 హ్యారీ బ్రూక్, 6 బెన్ స్టోక్స్ (కెప్టెన్), 7 జామీ స్మిత్ (wk), 8 క్రిస్ వోక్స్, 9 బ్రైడన్ కార్సే, 10 జోష్ టంగ్, 11 షోయబ్ బషీర్.
భారత్: 1 యశస్వి జైస్వాల్, 2 కేఎల్ రాహుల్, 3 కరుణ్ నాయర్, 4 శుభమన్ గిల్ (కెప్టెన్), 5 రిషబ్ పంత్ (wk), 6 నితీష్ కుమార్ రెడ్డి, 7 రవీంద్ర జడేజా, 8 వాషింగ్టన్ సుందర్, 9 ఆకాష్ దీప్, 10 మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ 11






