- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ENG vs WI, 3rd Test : మూడో టెస్టూ ఇంగ్లాండ్‌దే.. విండీస్‌పై టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్
దిశ, స్పోర్ట్స్ : విండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా ఆఖరిదైన మూడో టెస్టునూ నెగ్గి 3-0తో సిరీస్‌ను దక్కించుకుంది. మూడో టెస్టులో ఆదివారం ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. మార్క్‌వుడ్ ఐదు వికెట్లతో చెలరేగడంతో మరో రెండు రోజులు మిగిలి ఉండగానే ఇంగ్లిష్ జట్టు విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 282 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 376 స్కోరు చేసి 94 పరుగుల ఆధిక్యం సాధించింది.
రెండో రోజే రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన కరేబియన్ జట్టు ఓవర్ నైట్ స్కోరు 33/2తో మూడో రోజు ఆట కొనసాగించింది. మార్క్‌వుడ్(5/40) పేస్‌తో బెంబేలెత్తించడంతో విండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మికిల్ లూయిస్(57), కావెమ్ హోడ్జ్(55) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా వారు విఫలమయ్యారు. దీంతో విండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే ఆలౌటై ప్రత్యర్థి ముందు 82 పరుగుల స్వల్ప లక్ష్యం నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 7.2 ఓవర్లలోనే చేధించింది. బెన్ స్టోక్స్(51 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ బాదగా.. బెన్ డక్కెట్(25) కూడా నాటౌట్‌గా నిలిచాడు. కరేబియన్ జట్టుపై ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఇది నాలుగోసారి.
- Tags
- #ENG vs WI