- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడో టెస్ట్ కు ఇంగ్లాండ్ రెడీ...భారీ మార్పులతో జట్టు రెడీ !
టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. ఇందులో ఒక మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవగా మరో మ్యాచ్ టీమ్ ఇండియా విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది టీమిండియా. ఇక టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మూడవ టెస్టు లండన్ లోని లార్డ్స్ ( Lords) వేదికగా జరగనుంది.
ఈ లార్డ్స్ టెస్ట్ నేపథ్యంలో ఇంగ్లాండ్.. జట్టును ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన జట్టులో ఆర్చర్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అతడు జట్టులోకి వస్తే టీమిండియా కు కష్టాలు తప్పవని కూడా అంటున్నారు. అదే సమయంలో టీమిండియా కూడా ఒక మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. బుమ్రా మూడో టెస్టు ఆడే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (C), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బెథెల్, బ్రూక్, కార్స్, సామ్ కుక్, క్రాలే, డకెట్, ఓవర్టన్, పోప్, రూట్, జేమీ స్మిత్, టంగ్, వోక్స్.






