- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఒడిశాలోని కటక్ మైదానం(Cuttack Stadium) వేదికగా భారత్(Team India), ఇంగ్లండ్(England)లో మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది.

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని కటక్ మైదానం(Cuttack Stadium) వేదికగా భారత్(Team India), ఇంగ్లండ్(England)లో మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యింది. 49.1 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ధ శతకాలు బాదారు. చివర్లో లివింగ్‌స్టన్ (41 ) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బ్రూక్(31), బట్లర్(34) కూడా రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ 305 పరుగులు చేయాల్సి ఉంది.
కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇది రెండో మ్యాచ్ మాత్రమే కాదు.. నిర్ణయాత్మక మ్యాచ్ కూడా. ఇంగ్లాండ్ సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. కాబట్టి ఇది ఇంగ్లాండ్‌కు ‘డూ ఆర్ డై’ మ్యాచ్. మరోవైపు.. ఈ రెండో మ్యాచ్ కోసం రెండు జట్లు మొత్తం 5 మార్పులు చేశాయి. ఇంగ్లాండ్ జట్టులో 3 మార్పులు చేయగా, భారత్ రెండు మార్పులు చేసింది. మోకాలి గాయం తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాబట్టి, యశస్వి జైస్వాల్ పెవిలియన్‌కు పరిమితమయ్యాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం లభించింది. దీంతో, టీమిండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన రెండో అతి పెద్ద వయస్కుడిగా వరుణ్ నిలిచాడు. ఇంగ్లాండ్ నుంచి మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్ జామీ ఓవర్టన్‌లు తుది జట్టులోకి వచ్చారు.






