- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడో టెస్టు కోసం ప్రమాదకరమైన బౌలర్‌ను రంగంలోకి దించిన ఇంగ్లాండ్
నేటి నుంచి భారత్‌తో జరగబోయే మూడో టెస్టుకు తమ తుది జట్టును ఇంగ్లాండ్ బుధవారం ప్రకటించింది.

దిశ, స్పోర్ట్స్ : నేటి నుంచి భారత్‌తో జరగబోయే మూడో టెస్టుకు తమ తుది జట్టును ఇంగ్లాండ్ బుధవారం ప్రకటించింది. తుది జట్టులో ఇంగ్లాండ్ ఒకే ఒక్క మార్పు చేసింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి ఇంగ్లాండ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ 2021లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. సుదీర్థ విరామం తర్వాత అతను టెస్టుల్లోకి పునరాగమనం చేయనున్నాడు. రెండో టెస్టుకు ముందే ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి ఆర్చర్‌ను చేర్చినప్పటికీ రెండో టెస్టులో మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యాడు. రెండో టెస్టులో భారీ ఓటమి నేపథ్యంలో పుంజుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్ ఆర్చర్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఆర్చర్ రాకతో ఇంగ్లాండ్ పేస్ దళం బలోపేతమైంది. బౌలింగ్ ఆల్‌రౌండర్ అట్కిన్సన్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. ఆర్చర్ మినహా రెండో టెస్టులో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టే మూడో టెస్టులోనూ పాల్గొంటుంది.
ఇంగ్లాండ్ తుది జట్టు : జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జామీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడెన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.






