U19 WC 2026: ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్

by velandi.Saikiran |

అండర్ 19 వన్డే ప్రపంచ కప్ 2026లో భాగంగా మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ పోరులో అదరగొట్టింది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్ కు చేరుకుంది.

U19 WC 2026: ఫైనల్లోకి దూసుకెళ్లిన ఇంగ్లండ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అండర్ 19 వన్డే ప్రపంచ కప్ 2026లో భాగంగా మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ పోరులో అదరగొట్టింది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఈ మొదటి సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ ఏకంగా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది.

ఈ నేపథ్యంలో 50 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ U 19 జట్టు ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆస్ట్రేలియా తేలిపోయింది. 47.3 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా, 250 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇక ఈ విజయంతో ఇంగ్లాండ్ ఫైనల్ కు వెళ్ళగా.. ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. బుధ వారం ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య రెండో సెమీ ఫైనల్ ఉంది. ఇందులో గెలిచిన జట్టు, ఇంగ్లాండ్ తో ఫైనల్ ఆడనుంది.

Next Story