- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గెలిపించిన నైట్.. బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. హెదర్ నైట్ అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించింది.

దిశ, స్పోర్ట్స్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ అమ్మాయిలు వరుసగా రెండో విజయం సాధించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన లోస్కోర్ థ్రిల్లర్‌లో నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించారు. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. శోభన మోస్తారీ (60) హాఫ్ సెంచరీతో రాణించగా.. రబేయా ఖాన్ (43), షర్మీన్ అఖ్తర్ (30) కీలక ఇన్నింగ్సులు ఆడారు. మిగతా వారిలో షోర్నా అక్తర్ (10) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్సెల్‌టోన్ మూడు వికెట్లతో చెలరేగగా.. చార్లీ డీన్, అలైస్ క్యాప్సీ, లిన్సీ స్మిత్ తలో రెండు వికెట్లతో రాణించారు.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా తడబడిందనే చెప్పాలి. ఓపెనర్లు టామా బ్యూమౌంట్ (13), అమీ జోన్స్ (1) విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో హెదర్ నైట్ (79 నాటౌట్), కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (32) కీలకమైన భాగస్వామ్యంతో ఆ జట్టును ఆదుకున్నారు. నాట్ సివర్‌ను అవుట్ చేసిన ఫాహిమా ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసింది. సోఫియా డంక్లీ (0), ఎమ్మా లాంబ్ (1)ను కూడా పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. అయితే చివర్లో అలైస్ క్యాప్సీ (20), చార్లీ డీన్ (27 నాటౌట్) ఇద్దరితో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పిన నైట్.. ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చింది. బంగ్లా బౌలర్లలో ఫాహిమా మూడు, మరూఫా అక్తర్ రెండు వికెట్లతో రాణించారు.
సంక్షిప్త స్కోరు బోర్డు
బంగ్లాదేశ్: 178 ఆలౌట్ (49.4 ఓవర్లలో)
శోభన మోస్టరీ 60, షర్మీర్ అఖ్తర్ 30, రబేయా ఖాన్ 43
ఎక్స్‌ట్రాలు: 17
బౌలింగ్: సోఫీ ఎక్సెల్‌టోన్ (3/24), లిన్సీ స్మిత్ (2/33), చార్లీ డీన్ (2/28), అలైస్ క్యాప్సీ (2/31)
ఇంగ్లండ్: 182/6 (46.1 ఓవర్లలో)
హెదర్ నైట్ 79 నాటౌట్, నాట్ సివర్ బ్రంట్ 32, అలైస్ క్యాప్సీ 20, చార్లీ డీన్ 27 నాటౌట్
ఎక్స్‌ట్రాలు: 9
బౌలింగ్: ఫాహిమా ఖాటూన్ (3/16), మరూఫా అక్తర్ (2/28)






