- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS ENG: రెండో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్
ఇండియా (India) వర్సెస్ ఇంగ్లాండ్ (England)మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ లో

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా (India) వర్సెస్ ఇంగ్లాండ్ (England)మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ లో పర్యటించింది టీమిండియా. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ పూర్తయింది. ఇందులో టీమిండియా దారుణంగా ఓడిపోగా.. ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక రెండో టెస్టుకు రెండు జట్లు రెడీ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రెండో టెస్ట్ కోసం తమ జట్టును ప్రకటించింది ఇంగ్లాండు టీం.
ఎడ్జ్ బాస్టన్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి రెండో టెస్టు ప్రారంభం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో రెండు టెస్ట్ కోసం ఇంగ్లాండ్ సిద్ధమైంది. తమ జట్టును కూడా ప్రకటించింది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు ఇంగ్లాండ్. స్టార్ ఆటగాడు ఆర్చర్ వస్తారని.. ముందుగా ప్రచారం చేసినప్పటికీ.. అతడు రావడం లేదని తెలిపింది. తొలి టెస్ట్ లో ఎవరైతే ఆడారో వాళ్లతోనే ఇంగ్లాండ్... బరిలోకి దిగుతోంది. ఇటు టీమిండియా మాత్రం... భారీ మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
రెండవ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ టీం:
క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్ (c), జామీ స్మిత్ (WK), వోక్స్, కార్సే, టంగ్, బషీర్.






