ENG vs IND : బుమ్రాకు రెస్ట్.. నితీశ్‌కు చాన్స్.. వారిద్దరిపై వేటు

by Harish |

రెండో టెస్టు కోసం భారత్ తమ తుది జట్టులో మార్పులు చేసింది.

ENG vs IND : బుమ్రాకు రెస్ట్.. నితీశ్‌కు చాన్స్.. వారిద్దరిపై వేటు
X

దిశ, స్పోర్ట్స్ : రెండో టెస్టు కోసం భారత్ తమ తుది జట్టులో మార్పులు చేసింది. అందరూ అనుకున్నట్టే స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో యువ పేసర్ ఆకాశ్ దీప్‌కు చోటు దక్కింది. అర్ష్‌దీప్‌ సింగ్‌కు స్థానం కల్పించనున్నట్టు కథనాలు వచ్చినా.. ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆకాశ్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గుచూపింది. అలాగే, తొలి టెస్టులో నిరాశపర్చిన సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్‌పై వేటు పడింది. వారి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌ తుది జట్టులోకి వచ్చారు. స్పిన్నర్ కోటాలో స్పెషలిస్ట్ అయిన కుల్దీప్ యాదవ్‌ను కాకుండా సుందర్‌ను సెలెక్ట్ చేశారు. మరోవైపు, తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోని కరుణ్ నాయర్‌కు మరో చాన్స్ ఇచ్చారు. తుది జట్టులో మార్పులపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రాను పక్కనపెట్టడం సరైంది కాదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌లోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రాకు విశ్రాంతినివ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తుది జట్టులో కుల్దీప్‌ లేకపోవడంతో తాను అయోమయానికి గురయ్యానని గవాస్కర్ చెప్పాడు. ఎడ్జ్‌బస్టన్ పిచ్‌పై బంతి స్వింగ్ అవుతుందని, ఆ పిచ్‌ అతనికి సరిగ్గా సరిపోతుందన్నాడు.


Next Story