- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకేసారి వచ్చిన వర్షం, టీ బ్రేక్.. విజయానికి 102 పరుగుల దూరంలో ఇంగ్లాండ్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఐదో రోజు రసవత్తరంగా సాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఐదో రోజు రసవత్తరంగా సాగుతోంది. 371 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు డకెట్, క్రాలీ భారీ భాగస్వామ్యాన్ని అందించారు. మొదటి సెషన్ లంచ్ బ్రేక్ సమయానికి ఒక్క వికెట్ కోల్పోకుండా 117 పరుగులు చేసింది. అనంతరం డకెట్ సెంచరీ చేయగా.. మధ్యలో వచ్చిన వర్షం ఇంగ్లాండ్ బ్యాటర్ల స్పీడ్ కు బ్రేకులు వేసింది. అనంతరం కొద్ది సేపటికే వర్షం తగ్గడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా భారత బౌలర్లు ప్రసిద్ద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ లు వెంట వెంటనే చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. దీంతో చివరి రోజు టీ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 58.3 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 269 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు విజయానికి మరో 102 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అయితే టీ బ్రేక్ సమయానికి వర్షం పడటంతో మరోసారి పిచ్ మీదకు కవర్లను తీసుకొచ్చారు. వర్షం తగ్గి టీ బ్రేక్ ముగిసిన 10 నిమిషాలకే మ్యాచ్ ప్రారంభం అయింది. మరీ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలుస్తుందా.. లేక భారత్ గెలుస్తుందో తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే.






