వూహాన్‌లో ఎండ తట్టుకోలేక టోర్నీ నుంచి ఎమ్మా రాడుకాను రిటైర్!

by Phanindra |

ఎండ తట్టుకోలేక వూహాన్‌ ఓపెన్ నుంచి ఎమ్మా రాడుకాను రిటైర్ అయింది. పోలిష్ స్టార్ ఇగా స్వియటెక్ మూడో రౌండ్‌లో సునాయాస విజయం సాధించింది.

వూహాన్‌లో ఎండ తట్టుకోలేక టోర్నీ నుంచి ఎమ్మా రాడుకాను రిటైర్!
X

దిశ, స్పోర్ట్స్: వూహాన్ ఓపెన్‌లో టెన్నిస్ స్టార్ ఇగా స్వియటెక్ ముందడుగు వేసింది. మంగళవారం నాడు మారీ బోజుకోవాతో జరిగిన మ్యాచులో అద్భుతంగా రాణించింది. వరుస సెట్లను 6-1, 6-1తో గెలిచిన ఆమె మూడో రౌండ్‌లో అడుగు పెట్టింది. కొన్నిరోజుల క్రితం జరిగిన చైనా ఓపెన్‌లో నాలుగో రౌండ్‌లో ఇంటిదారి పట్టిన ఇగా.. ఈసారి పట్టుదలగా ఆడుతోంది. మారీపై గెలుపు ఈ ఏడాదిలో ఇగాకు 60వ విజయం కావడం గమనార్హం. గత నాలుగేళ్లుగా ప్రతియేటా 60కు పైగా విజయాలు నమోదు చేస్తూనే వస్తోందీ పోలిష్ స్టార్.

రాడుకాను అవుట్

ఈ పోటీల నుంచి ఇంగ్లండ్ స్టార్ ఎమ్మా రాడుకాను తప్పుకుంది. అమెరికాకు చెందిన ఆన్ లీతో జరిగిన తొలి రౌండ్ మ్యాచులోనే ఎమ్మా ఇబ్బంది పడింది. విపరీతమైన వేడి కారణంగా అలసిపోయిన ఆమె మెడికల్ బ్రేక్ తీసుకుంది. 6-1, 4-1తో వెనుకబడిన ఆమె అలసటతో ఆడలేకపోయింది. దీంతో మెడికల్ టైంఅవుట్ తీసుకున్న ఆమె.. బీపీ, టెంపరేచర్ చెక్ చేయించుకుంది. ఇక మ్యాచ్ కొనసాగించలేక రిటైర్ అయింది.

Next Story