- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఝలక్.. నోటీసులు ఇచ్చిన ఈడీ
భారత్ మాజీ డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ మాజీ డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. 1 ఎక్స్ బెట్ అనే అక్రమ బెట్టింగ్ యాప్‌తో సంబంధం కలిగి ఉన్నారంటూ మనీలాండరింగ్ కేసులో శిఖర్ ధవన్‌ను ప్రశ్నించనున్నారు. అయితే, 1 ఎక్స్ బెట్ సంస్థతో అతడు ఎండార్స్‌మెంట్లు చేసుకున్నాడని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద శిఖర్ ధవన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అయితే, గత నెలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఈడీ ఇదే కేసులో ప్రశ్నించింది. అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 1 ఎక్స్ బెట్ యాప్ సంస్థపై ఈడీ విస్తృతంగా విచారణ చేపడుతోంది. కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చింది. యువత వ్యసనాలు, ఆర్థిక మోసాలను నిరోధించేందుకు కేంద్రం ఆలైన్ బెట్టింగ్ యాప్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.






