- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘డ్యూక్స్’ తిప్పలు.. అంపైర్‌తో గిల్ వాగ్వాదం.. చికాకు పడ్డ సిరాజ్
ఇంగ్లండ్ టూర్లో టీమిండియాకు ‘డ్యూక్స్’ బంతితో సమస్యలు వస్తున్నాయి. అంపైర్‌తో గిల్ పెద్ద గొడవ పడగా.. సిరాజ్ కూడా చికాకు పడ్డాడు.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టుల్లో టీమిండియాకు ‘డ్యూక్స్’ బాల్‌తో ఇబ్బందులు తప్పడం లేదు. లార్డ్స్ వేదికగా జరుతున్న మ్యాచులో కూడా ఈ బంతితో తలనొప్పులు వచ్చాయి. రెండో రోజు ఆట మొదలైన తర్వాత కేవలం పది ఓవర్లు వేసిన తర్వాత కొత్త బంతి షేప్ మారిపోయింది. నిలకడగా ఆడుతున్న రూట్, స్టోక్స్, వోక్స్‌ను అవుట్ చేసిన తర్వాత.. 91వ ఓవర్లోనే బంతి షేప్ కోల్పోయింది. కొత్త బంతి ఇంత త్వరగా షేప్ మారిపోవడంపై పలువురు మాజీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అంపైర్ వద్ద ఉన్న గాజ్ నుంచి బంతి వెళ్లకపోవడంతో మరో బంతిని ఎంపిక చేశారు. అయితే ఆ బంతి మరీ పాతగా ఉండటంతో గిల్, సిరాజ్ అసహనానికి గురయ్యారు. అంపైర్‌తో గిల్ చాలాసేపు వాదించాడు. ఆ తర్వాత సిరాజ్ కూడా ‘ఇది పది ఓవర్లు మాత్రమే వేసిన బంతా? సీరియస్లీ?’ అంటూ చికాకుపడ్డాడు. ఆ తర్వాత కొన్ని ఓవర్లు వేయగానే ఆ బంతి కూడా షేప్ కోల్పోయింది. దీంతో మరో బంతి తీసుకోవాల్సి వచ్చింది.
తొలి టెస్టులో కూడా ఇలా బంతి విషయంలో పంత్‌కు, అంపైర్‌కు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అసలు డ్యూక్స్ బంతులే బాగలేవని, కాసేపటికే మెత్తబడిపోవడం, షేప్ కోల్పోవడం జరుగుతోందని గిల్ మండిపడ్డాడు.






