ఎక్కువ దూరం ఆలోచించను : స్మృతి మంధాన

by Harish |

తాను ఎక్కువ దూరం ఆలోచించనని భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తెలిపింది.

ఎక్కువ దూరం ఆలోచించను : స్మృతి మంధాన
X

దిశ, స్పోర్ట్స్ : తాను ఎక్కువ దూరం ఆలోచించనని భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తెలిపింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న మంధానను ఈ ఏడాది భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ సన్నద్ధత గురించి అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. చాలా దూరం ఆలోచించకూడదని తాను ఎక్కువగా నమ్ముతానని చెప్పింది. ప్రక్రియపైనే తమ ఫోకస్ ఉంటుందని, ప్రతి రోజు సరైన పని చేయడమే లక్ష్యమని తెలిపింది. ‘జట్టుగా కూడా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటాం. వచ్చే ఐదారు నెలలు సుదీర్ఘ క్రికెట్‌ను కలిగి ఉన్నాం. అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. సరిగ్గా పనిచేస్తే పనులు వాటంతటవే అవుతాయి. ప్రయత్నిద్దాం. బాగా చేద్దాం.’అని తెలిపింది. అలాగే, దుబాయ్‌లో కొత్త క్రికెట్ అకాడమీని ప్రారంభించబోతున్నట్టు మంధాన తెలిపింది. దుబాయ్‌లో యూకేకు చెందిన డాన్ భగవతితో కలిసి సిటీ క్రికెట్ అకాడమీని ప్రారంభించనుంది. దీని గురించి మంధాన మాట్లాడుతూ..‘ప్రస్తుతం నేను క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టా. డాన్ కోచింగ్‌ను చూసుకుంటాడు. డాన్ చాలా ఏళ్లుగా తెలుసు. మొదటిసారిగా అతని పేరు విన్నప్పుడు భయపడ్డాను. ఈ డాను ఎవరు? అని ఆశ్చర్యపోయాను. కానీ, కాలక్రమేణా డాన్ అతని కుటుంబం ఇంగ్లాండ్‌లో నాకు కుటుంబంలా మారింది.’అని మంధాన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. నేడు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.


Next Story