- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుమ్రాపై పనిభారం మరీ ఎక్కువైందా? లెక్కలు ఏం చెప్తున్నాయి?
బుమ్రాపై పనిభారం మరీ ఎక్కువైందా? లెక్కలు ఏం చెప్తున్నాయి? టీమిండియా అతన్ని మరీ ఎక్కువగా వాడేస్తుందా? తెలియాలంటే ఈ లెక్కలు చూడాల్సిందే.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా ప్రీమియం పేసర్ జస్ప్రీత్ బుమ్రా పనిభారంపై పెద్ద డిబేట్ జరుగుతోంది. ఇలాంటి కీలకమైన ప్లేయర్‌ను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, వర్క్‌లోడ్ మేనేజ్ చేయాలని చాలామంది అంటున్నారు. ‘అసలు వర్క్‌లోడ్ మేనేజ్ ఏముంది? మా టైంలో ఇలాంటివేం లేవే?’ అంటున్న మాజీలూ ఉన్నారు. ఈ క్రమంలో అసలు నిజంగానే బుమ్రాను టీమిండియా మరీ ఎక్కువ వాడుకుంటోందా? అతనిపై పనిభారం అందరూ అనుకునేంత ఎక్కువగా ఉందా? అనే అనుమానాలు రావడం సహజం. వీటికి తాజా గణాంకాలే సమాధానం చెప్తున్నాయి.
ఇంగ్లండ్‌తో జరిగిన హెడింగ్లే టెస్టులో బుమ్రా చేత ఏకంగా 44 ఓవర్లు వేయించాడు శుభ్‌మన్ గిల్. ఈ మ్యాచులో అత్యధిక ఓవర్లు వేసిన పేసర్ బుమ్రానే. మరో పేసర్ సిరాజ్ కూడా 41 ఓవర్లు వేశాడు. అంటే అతన్ని మరీ ఎక్కువగా వాడుకున్నట్లే కదా. ఫలితంగా బుమ్రా ఐదు వికెట్లు తీసుకోగా.. సిరాజ్ కేవలం రెండే తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. మరీ చరిత్రలోకి వెళ్లకుండా గతేడాది నుంచి లెక్కలు తీసినా.. బుమ్రానే ప్రపంచంలో ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్‌గా నిలిచాడు.
బుమ్రా బౌలింగ్ లెక్కలు
2024 జనవరి నుంచి ఇప్పటి వరకు బుమ్రా 15 టెస్టులు ఆడాడు. వీటిలో అతనితో టీమిండియా ఏకంగా 410.4 ఓవర్లు వేయించింది. ఇలా ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (362.3 ఓవర్లు) రెండో స్థానంలో ఉన్నాడు. అంటే స్టార్క్ కన్నా బుమ్రా ఆల్మోస్ట్ 50 ఓవర్లు ఎక్కువ వేశాడన్నమాట. స్టార్క్ 48 వికెట్లు తీసుకుంటే.. బుమ్రా 78 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ప్యాట్ కమిన్స్ (359.1 ఓవర్లలో 51 వికెట్లు), మహమ్మద్ సిరాజ్ (355.3 ఓవర్లలో 41 వికెట్లు), గస్ అట్కిన్సన్ (328 ఓవర్లలో 55 వికెట్లు) ఉన్నారు. బుమ్రా తర్వాత జడేజా (400.1 ఓవర్లు) మాత్రమే 400 కన్నా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంటే బుమ్రాపై టీమిండియా ఎంతలా ఆధారపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బుమ్రాపై టీమిండియా పెడుతున్న పని భారమే.






