- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్సీబీ గ్రీన్ జెర్సీలు ఎలా తయారు చేస్తారో తెలుసా?
మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 18వ సీజన్ జూన్ 3వ తేదీతో ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్: మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 18వ సీజన్ జూన్ 3వ తేదీతో ముగిసింది. 17 సంవత్సరాల కలను తెరదించి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చివరికి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి.. అద్భుతమైన ఆటతీరుతో ఐపీఎల్-2025లో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ సందర్భంగా ఆర్సీబీకి సంబంధించిన విషయాలను తెలసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. పలు మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్స్ వేసుకునే గ్రీన్ జెర్సీల తయారీ వెనుక ఉన్న గొప్ప కారణాన్ని ఈ సందర్భంగా తెలుసుకుందాం.
ఆర్సీబీ యాజమాన్యం ఒక ప్రత్యేకమైన సామాజిక బాధ్యతతో 'గో గ్రీన్ (Go Green)' అనే కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రీన్ ఇన్షియేటివ్ ప్రోగ్రామ్‌లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆర్సీబీ ప్రతి ఏటా ఇలా ఓ మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీతో ఆడుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ జెర్సీలను ధరించటమే కాదు.. ఆ జెర్సీల తయారీ వెనుక ఓ స్పెషల్ స్టోరీ ఉంది. ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసిన ఫ్యాబ్రిక్‌తో ఈ జెర్సీలను తయారు చేస్తారు. మ్యాచ్‌లు జరిగిన తర్వాత స్టేడియంలో పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను, ఇతర వేదికల నుంచి సేకరించిన PET బాటిళ్లను సేకరించి, వాటిని జాగ్రత్తగా శుభ్రం చేసి రీసైక్లింగ్‌కు సిద్ధం చేస్తారు. ఈ బాటిళ్లను శుభ్రం చేసి, వాటిని చిన్న చిన్న ఫ్లేక్స్ మాదిరిగా ముక్కలుగా చేస్తారు. ఈ ప్లాస్టిక్ ఫ్లేక్స్‌ను ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా పాలీయెస్టర్ ఫైబర్‌గా మార్చుతారు. ఇది ఒక తేలికపాటి, బలమైన, మెత్తటి నూలు లాంటి పదార్థం. ఈ పాలీయెస్టర్ ఫ్యాబ్రిక్ ఉపయోగించి జెర్సీలను తయారుచేస్తారు. దాదాపు 11,000 ప్లాస్టిక్ బాటిళ్లు రీసైకిల్ చేస్తే ఒక్క జెర్సీ తయారు అవుతుంది.






