- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబైకి చావో..రేవో! నేడు ఆర్సీబీతో కీలక మ్యాచ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు ముంబాయి ఇండియన్స్ జట్టు అగ్ని పరీక్షను ఎదుర్కోనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు ముంబాయి ఇండియన్స్ జట్టు అగ్ని పరీక్షను ఎదుర్కోనుంది. వరుసగా ఐదు మ్యాచ్ లలో గెలిచి తర్వాత రెండింటిలో ఓడిన ముంబాయి ఇండియన్స్ జట్టు .. ఐదు మ్యాచ్ లలో ఓడి చివరి రెండింటిలో గెలిచిన ఆర్సీబీ జట్టుతో డీవై పాటిల్ స్టేడియం వేదికగా నేడు తలపడనుంది. ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ లను ఆడనున్నాయి.
నేటి మ్యాచ్ లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ కు దిగనుంది. అదేవిధంగా ఈ సీజన్ లో హర్మన్ సేన తొలిసారి టాస్ గెలవడం విశేషం. ఈ మ్యాచ్ గెలిచినా.. ఓడినా ఆర్సీబీకి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ, ముంబాయి ఇండియన్స్ జట్టు ఈ మ్యాచ్ చాలా కీలకం. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిన ఆ జట్టు నేటి మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ కు చేరుతుంది. అది ఎక్కువ మార్జిన్ తో గెలవాలి.






