- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత బాక్సింగ్ టీమ్ విదేశీ కోచ్‌గా డిమిత్రి డిమిత్రుక్..
భారత బాక్సింగ్ టీమ్ విదేశీ కోచ్‌గా సీనియర్ కోచ్ డిమిత్రి డిమిత్రుక్‌ను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌ఐ) మంగళవారం నియమించింది.

న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ టీమ్ విదేశీ కోచ్‌గా సీనియర్ కోచ్ డిమిత్రి డిమిత్రుక్‌ను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌ఐ) మంగళవారం నియమించింది. పురుషుల చీఫ్ కోచ్ సి.ఏ కుట్టప్ప, మహిళల హెడ్ కోచ్ భాస్కర్ భట్‌తో కలిసి అతను రెండేళ్లపాటు భారత బాక్సర్లకు శిక్షణ ఇవ్వనున్నాడు. కోచ్‌గా డిమిత్రి డిమిత్రుక్ విశేష అనుభవం ఉన్నది. 12 ఏళ్లపాటు ఐరిష్ అథ్లెటిక్ బాక్సింగ్ అసోసియేషన్‌కు సేవలందించారు.
2015, 2017 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన జో వార్డ్‌తోపాటు 2019 యూరోపియన్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న గ్రెయిన్ వాల్ష్ వంటి ఐర్లాండ్ బాక్సర్లు డిమిత్రి డిమిత్రుక్ శిక్షణలో రాటుతేలినవారే. బాక్సింగ్ పవర్‌హౌజ్‌గా భారత్ అవతరిస్తున్నందని, ప్రతిభావంతులైన భారత బాక్సర్లకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం రావడం ఆనందంగా ఉందని డిమిత్రి డిమిత్రుక్ తెలిపాడు.






