RCBలో వాటాల కొనుగోలు.. DK శివకుమార్ క్లారిటీ !

by velandi.Saikiran |

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB Team)చుట్టూ ఇప్పుడు వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న స్వామి

RCBలో వాటాల కొనుగోలు..  DK శివకుమార్ క్లారిటీ !
X

దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB Team)చుట్టూ ఇప్పుడు వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న స్వామి స్టేడియం దగ్గర... తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో... బెంగళూరు యాజమాన్యం (RCB) వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆ జట్టును అమ్మేస్తారని... 1600 కోట్లకు... డీలింగ్ కుదిరిందని... సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అందుకుంది.

ఇక ఆ జట్టును కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar ).. కొనుగోలు చేస్తారని.. లేదా.. అందులో కొన్ని వాటాలు అయినా కొనుగోలు చేస్తారని ప్రచారం అందుకుంది. అయితే ఈ వార్తలపై తాజాగా... స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని ఆయన కొట్టి పారేశారు.

తాను ఏ జట్టును కొనుగోలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. తాను చిన్నప్పటి నుంచి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ లో సభ్యుడిని మాత్రమే అని వివరించారు. బెంగళూరు మేనేజ్మెంట్ లో భాగస్వామిగా చేరాలని ఆఫర్లు ఉన్నప్పటికీ.. నాకు సెట్ కాలేదన్నారు. నాకు బెంగళూరు ఎందుకు అవసరమా? అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు డీకే శివకుమార్.


Next Story