- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Novak Djokovic : ఫెదరర్ రికార్డు బద్దలు కొట్టిన జకోవిచ్
టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ రికార్డును జకోవిచ్ బద్దలు కొట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ రికార్డును జకోవిచ్ బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఫెదరర్ (429) టాప్‌లో ఉన్నాడు. బుధవారం ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్ 430 గ్రాండ్ స్లామ్ మ్యాచ్‌లు ఆడి ఫెదరర్ రికార్డును బ్రేక్ చేశాడు. సెరెనా విలియమ్స్ (423) మ్యాచ్‌లు ఆడారు.
మూడో రౌండ్ చేరుకున్న జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో పోర్గుగల్ ఆటగాడు జైమీ ఫరియాపై జకోవిచ్ 6-1, 6-7, 6-3, 6-2 తేడాతో గెలిచాడు. మూడో రౌండ్‌లో జకోవిచ్ చెక్ రిపబ్లిక్ ఆటగాడు థామస్ మెకాక్‌తో తలపడనున్నాడు. ఈ సందర్భంగా జకోవిచ్ మాట్లాడాడు. ‘నేను ఆటను ప్రేమిస్తా, పోటీని ఇష్టపడతాను. ప్రతిసారి అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషి చేస్తా. 20 ఏళ్లుగా గ్రాండ్ స్లామ్స్ ఆడుతున్నాను. గెలిచినా.. ఓడినా.. ఆటను ఆస్వాదిస్తా. మరో రికార్డు బ్రేక్ చేసినందుకు గర్వంగా ఉంది.’ అని జకోవిచ్ అన్నాడు.






