అప్రతిష్ట పాలైన కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్.. 13 ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-13 17:27:29  IST  )

వెస్టిండీస్‌ (West Indies)తో ఢిల్లీ వేదికగా జరగుతోన్న రెండో టెస్ట్‌లో భారత్ (India) విజయానికి చేరువలో ఉంది.

అప్రతిష్ట పాలైన కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్.. 13 ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్!
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌ (West Indies)తో ఢిల్లీ వేదికగా జరగుతోన్న రెండో టెస్ట్‌లో భారత్ (India) విజయానికి చేరువలో ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) చెత్త రికార్టును మూటగట్టుకున్నాడు. 13 ఏళ్ల తర్వాత ప్రత్యర్థిని ఫాలో‌ఆన్ ఆడించి బ్యాటింగ్‌కు దిగిన తొలి కెప్టెన్‌గా అప్రతిష్ట పాలయ్యాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియాకు 270 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రత్యర్థి జట్టును ఫాలో‌ఆన్ ఆడించగా.. ఆ జట్టలో ఇద్దరు సెంచరీలు చేశారు. కాగా, చివరిసారిగా 2012లో మహేంద్ర సింగ్ ధోనీ (Mahindra Singh Dhoni) కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ (England)తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఫాలో‌ఆన్ ఆడించి ఫోర్త్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.

Next Story