వన్డే జట్టులో రోహిత్, కోహ్లీల చోటుపై చర్చ.. గంభీర్‌పై అఫ్రిది షాకింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-10 14:49:09  IST  )

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)తో రోహిత్, కోహ్లీల అభిప్రాయబేధాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

వన్డే జట్టులో రోహిత్, కోహ్లీల చోటుపై చర్చ.. గంభీర్‌పై అఫ్రిది షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)తో రోహిత్, కోహ్లీల అభిప్రాయబేధాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ టీవీ షోలో ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను 2027 ప్రపంచ కప్ వరకు జట్టులో కొనసాగించాలని అన్నారు. అదేవిధంగా కోచ్ గంభీర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇద్దరు దిగ్గజాలను తెలివిగా ఉపయోగించుకోవాలని హితవు పలికారు. బలహీన జట్లతో ఆడేటప్పుడు వారికి విశ్రాంతి ఇచ్చి, కీలక సిరీస్‌లలో వారిని ఆడించాలని సలహా ఇచ్చారు. విరాట్, రోహిత్ భారత బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముక అనే వాస్తవాన్ని గంభీర్ కచ్చితంగా అంగీకరించాల్సిందేని అన్నారు.

నేను ముందే ఊహించా..

అదేవిధంగా వన్డేల్లో తన పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టినందుకు రోహిత్ శర్మను అఫ్రిది అభినందించారు. ఐపీఎల్-2009లో డెక్కన్ ఛార్జర్స్ (Deccan Chargers) తరఫున రోహిత్‌తో కలిసి ఆడినప్పుడు, అతడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పెద్ద స్టార్ అవుతాడని ముందే ఊహించానని అన్నారు. రికార్డులు బద్దలు కొట్టడానికే ఉంటాయని.. కానీ నా రికార్డును నా ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ బ్రేక్ చేయడం సంతోషంగా ఉందన్నారు.

Next Story