జురెల్ సూప‌ర్ సెంచ‌రీ.. తండ్రి అంకితం చేస్తూ

by velandi.Saikiran |   (  Updated:2025-10-03 11:02:02  IST  )

190 బంతుల్లోనే సెంచరీ చేసిన ధ్రువ్ జురెల్.... 125 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే సెంచరీ పూర్తయిన

జురెల్ సూప‌ర్ సెంచ‌రీ.. తండ్రి అంకితం చేస్తూ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో గిల్ సేన అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే 400కు పైగా పరుగులు సాధించిన టీమిండియా 262 పరుగుల లీడ్ సంపాదించింది. ఈ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ తో పాటు తాజాగా ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel) కూడా సెంచరీ నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ లో ధ్రువ్ జురెల్ తన మొదటి సెంచరీ నమోదు చేసుకున్నాడు.

190 బంతుల్లోనే సెంచరీ చేసిన ధ్రువ్ జురెల్.... 125 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే సెంచరీ పూర్తయిన తర్వాత...ధ్రువ్ జురెల్ చేసుకున్న సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ తొలి సెంచరీని తన తండ్రికి అంకితం చేశాడు. ఇండియన్ ఆర్మీ తరహాలో సెలబ్రేషన్స్ చేసుకున్న ధ్రువ్ జురెల్... తన సెంచరీని తండ్రికి అంకితం చేస్తున్నట్లు పరోక్షంగా తెలిపాడు. వాస్తవంగా ధ్రువ్ జురెల్ తండ్రి నేమ్ సింగ్ జురెల్.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. క్రికెట్ లో ధ్రువ్ జురెల్ రాణించడం వెనుక తన తండ్రి పాత్ర ఉంది. ఈ నేపథ్యంలో...సెంచ‌రీ చేసిన అనంతరం... అతనికి అంకితం చేశాడు ధ్రువ్ జురెల్. క్లిక్

Next Story