ధోని పొలిటికల్ ఎంట్రీ.. ఆనంద్ మహీంద్రా ఇంట్రస్టింగ్ ట్వీట్

by Disha Web Desk 4 |
ధోని పొలిటికల్ ఎంట్రీ.. ఆనంద్ మహీంద్రా ఇంట్రస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ధోని పొలిటికల్ ఎంట్రీపై ఆనంద్ మహీంద్రా ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ఐపీఎల్ -16 సీజన్ గెలిచిన సీఎస్కే టీంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న వేళ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోనిని ఫ్యూచర్ లీడర్ గా అభివర్ణించిన ఆనంద్ మహీంద్రా రాజకీయాలపై దృష్టి సారించాలని కూల్ కెప్టెన్‌కు సూచించారు. ‘ధోని మరో సీజన్ ఆడాలని కోరుకుంటున్నా.. అయితే ఎక్కువ రోజులు అలా జరగాలని ఆశించలేమని, ధోని పాలిటిక్స్ గురించి ఆలోచన చేస్తాడని నమ్ముతున్నా.. క్రీడా రంగంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఇతర విషయాల్లో కూడా ధోని అంతే చరుగ్గా వ్యవహరిస్తాడు. వినూత్నంగా థింక్ చేస్తాడు. ఖచ్చితంగా ధోని ఫ్యూచర్ లీడర్ అని మహీంద్రా ట్వీట్‌లో రాసుకొచ్చారు.



Next Story

Most Viewed