ఐపీఎల్ 2026 కోసం చెన్నై స్కెచ్‌..ధోని బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో మార్పులు!

by velandi.Saikiran |

మహేంద్ర సింగ్ ధోనిని నెంబర్ 3 స్థానంలో పంపించాలని చెన్నై అనుకుంటోంద‌ట. అలా నెంబర్ 3 లో మహేంద్రసింగ్ ధోని వస్తే, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.

ఐపీఎల్ 2026 కోసం చెన్నై స్కెచ్‌..ధోని బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో మార్పులు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే మహేంద్ర సింగ్ ధోనీకి చివరి సీజన్ అని కూడా ప్రచారం సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుందట. ఇందుకోసం మహేంద్ర సింగ్ ధోనిని నెంబర్ 3 స్థానంలో పంపించాలని చెన్నై అనుకుంటోంద‌ట. అలా నెంబర్ 3 లో మహేంద్రసింగ్ ధోని వస్తే, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.

అటాకింగ్ చేసే పాత ధోనిని మళ్లీ చూడవచ్చు. అందుకే ధోని బ్యాటింగ్ ఆర్డర్ మార్చేందుకు సిద్ధమయ్యారట. దీనికి ధోని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రెండు నెల‌ల ముందే ప్రాక్టీస్ మొద‌లు పెట్టాడ‌ట‌. అయితే ధోనిని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంటారా ? లేదా కీపింగ్ కూడా చేయిస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. సంజు శాంసన్ వచ్చిన నేపథ్యంలో ధోని వికెట్ కీపింగ్ చేయడం కూడా కష్టమే అంటున్నారు. ఇక దీనిపై అశ్విన్ కూడా స్పందించారు. చివరి దశలో ధోని కెరీర్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ధోని నెంబర్ 3 లో వస్తే బాగుంటుందని వివరించారు.

Next Story