MS Dhoni : షారూక్, అమితాబ్‌ కాదు.. ధోనీయే టాప్.. ఏ విషయంలో అంటే..?

by Sathputhe Rajesh |

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ చరిష్మా ఏ మాత్రం తగ్గడం లేదు.

MS Dhoni : షారూక్, అమితాబ్‌ కాదు..  ధోనీయే టాప్.. ఏ విషయంలో అంటే..?
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోనీ చరిష్మా ఏ మాత్రం తగ్గడం లేదు. కేవలం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ జార్ఖండ్ డైనమైట్ బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్‌లను కాదని 2024 తొలి అర్థ భాగంలో అత్యధిక బ్రాండ్‌లకు ఎండోర్స్‌మెంట్ చేస్తున్న వ్యక్తిగా ధోనీ నిలిచాడు. ఈ మేరకు టామ్ మీడియా రిసెర్చ్(యూఎస్ఏ నీల్సన్, యూకే కంటార్ జాయింట్ వెంచర్) వెల్లడించింది.

మొత్తం 42 బ్రాండ్లకు ఎండోర్స్‌మెంట్

2024 తొలి అర్థ భాగంలో ధోనీ మొత్తం 42 బ్రాండ్‌లతో బ్రాండ్ డీల్స్ కుదుర్చుకున్నాడు. ధోనీ తర్వాత అమిత్ బచ్చన్(41), షారూక్ ఖాన్(34) బ్రాండ్ డీల్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనీ తాజాగా యూరో గ్రిప్ టైర్స్, గల్ఫ్ ఆయిల్, క్లియర్ ట్రిప్, మాస్టర్ కార్డ్, సిట్రియాన్, లేస్, గురుడ ఏరోస్పేస్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్-2025 సీజన్‌కు గాను తాజాగా ధోనీని సీఎస్కే జట్టు రూ.4 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.

Next Story