T20 World Cup Final : మైదానంలోకి ప్రపంచకప్‌ను తీసుకొచ్చిన ధోనీ, రోహిత్‌.. అభిమానుల ఉద్వేగం!

by Ramesh Naini |

లక్షలాది మంది అభిమానుల కేరింతల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరు అద్భుతంగా ప్రారంభమైంది.

T20 World Cup Final : మైదానంలోకి ప్రపంచకప్‌ను తీసుకొచ్చిన ధోనీ, రోహిత్‌.. అభిమానుల ఉద్వేగం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లక్షలాది మంది అభిమానుల కేరింతల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరు అద్భుతంగా ప్రారంభమైంది. మ్యాచ్‌కు ముందు మైదానంలో చోటుచేసుకున్న ఒక దృశ్యం క్రికెట్ అభిమానులను ఉద్వేగానికి గురిచేసింది. భారత క్రికెట్ చరిత్రలో మురవలేని ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ కలిసి ప్రపంచకప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకువచ్చారు. ప్రపంచకప్‌ను తీసుకొచ్చిన ధోనీ, రోహిత్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు విన్నింగ్ కెప్టెన్లు ఇద్దరూ ట్రోఫీతో మైదానంలో అడుగుపెట్టగానే స్టేడియం హోరెత్తిపోయింది. సుమారు లక్ష మంది అభిమానుల సందడి నడుమ ధోనీ, రోహిత్ మెరిసిపోతూ ట్రోఫీని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డ భారత బ్యాటర్లు

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్, న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఫైనల్ మ్యాచ్ ఒత్తిడి ఏమాత్రం లేకుండా భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ప్రధాన స్కోర్లు ఇవే:

సంజూ శాంసన్: 89 పరుగులు

అభిషేక్ శర్మ: 52 పరుగులు

ఇషాన్ కిషన్: 54 పరుగులు

శివమ్ దూబే: 26 పరుగులు

హార్దిక్ పాండ్యా: 18 పరుగులు

ఆరంభం నుంచే బాదుడు..

ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టారు. మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీమిండియాకు అదిరిపోయే స్టార్ట్ అందించారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఎక్కడా తగ్గకుండా హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. మొత్తానికి సమిష్టి కృషితో భారత్ ఫైనల్‌లో కొండంత లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలవడానికి బౌలర్లు ఈ భారీ లక్ష్యాన్ని ఎలా కాపాడతారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Next Story