అంబానీ తప్పిదం... డేంజర్ గా మారిన ఆ ప్లేయర్.. ఇక ముంబైకి చుక్కలే

by velandi.Saikiran |

సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా... బ్రెవిస్ రికార్డు లోకి ఎక్కాడు. చెన్నై ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రెవిస్

అంబానీ తప్పిదం... డేంజర్ గా మారిన ఆ ప్లేయర్.. ఇక ముంబైకి చుక్కలే
X

దిశ, వెబ్ డెస్క్: సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో డేంజర్ ఆటగాడిగా మారుతున్నాడు బ్రేవిస్. టి20 స్పెషలిస్ట్ గా పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్ ( Dewald Bravis) ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో 125 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఆఫ్రికా తరఫున అత్యధిక టి20 వ్యక్తిగత స్కోర్ నమోదు చేసుకున్నాడు.

అలాగే సౌత్ ఆఫ్రికా జట్టు తరఫున సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా... బ్రెవిస్ రికార్డు లోకి ఎక్కాడు. అయితే ఐపీఎల్ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రెవిస్... తన కెరియర్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు బేబీ ఏబి. అయితే అప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున పెద్దగా అవకాశాలు అతనికి రాలేదు. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో Un-Sold ప్లేయర్ గా మిగిలిపోయాడు డెవాల్డ్ బ్రెవిస్. ఇక మొన్నటి ఐపిఎల్ 2025 సమయంలో... రీ- ప్లేస్ మెంట్ కింద చెన్నై జట్టులోకి వచ్చేసాడు బ్రెవిస్.

అనంతరం చెన్నై జట్టులో అద్భుతంగా రాణించాడు. ఇక ఇప్పుడు టి20 లీగ్ లో కూడా దుమ్ము లేపుతున్నాడు బేబీ ఏబీ. అయితే ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే... అంబానీ ఫ్యామిలీ ఇతని టాలెంట్ గుర్తించి.. జట్టులోనే ఉంచుకుంటే సరిపోయేది. కానీ వాళ్ళు చేసిన తప్పిదం కారణంగా చెన్నైలో కి వచ్చాడు ఈ డేంజర్ ఆటగాడు. ఇలాగే ఇతను ఆట తీరును ప్రదర్శిస్తే వచ్చే సీజన్ లో ముంబై ఇండియన్స్ పైన కూడా సెంచరీ కొట్టే ప్రమాదం పొంచి ఉంటుంది.

Next Story