ఐపీఎల్ ముందు పడిక్కల్ పరుగుల వరద.. ఆర్సీబీకి పండగే

by Phanindra |

ఐపీఎల్ 2026 ముందు ఆర్సీబీ స్టార్ పడిక్కల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక ఆర్సీబీకి పండగే అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఐపీఎల్ ముందు పడిక్కల్ పరుగుల వరద.. ఆర్సీబీకి పండగే
X

దిశ, స్పోర్ట్స్: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస పెట్టి సెంచరీలు బాదుతున్న అతను.. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచులో కూడా చెలరేగాడు. ఈ క్రమంలోనే మూడు సార్లు విజయ్ హజారే ట్రోఫీ సీజన్లలో 600పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఈ ఘనత అందుకోలేదు. గతంలో 2019-2020 సీజన్లో 11 మ్యాచుల్లో 609 పరుగులు చేసిన పడిక్కల్.. ఆ సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2020-2021 సీజన్లో ఏడు ఇన్నింగ్సుల్లో నాలుగు సెంచరీలు, 147.40 సగటుతో 737 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇక ఈ సీజన్లో కూడా అదే తరహా ఆటతీరు కనబరుస్తున్న అతను.. ఇప్పటికే 600 పరుగుల మార్కు దాటేయడం గమనార్హం. ఈ సీజన్లో 147, 124, 113 పరుగుల సెంచరీలు చేసిన అతను.. రాజస్థాన్‌ మ్యాచులో 91 పరుగుల వద్ద అవుటై త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న పడిక్కల్.. నయా సీజన్ ఆరంభానికి ముందు ఫుల్ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు శుభవార్తే అని చెప్పాలి.

Next Story