పడిక్కల్, జురెల్ భారీ శతకాలు.. భారత్-ఎ, ఆసీస్-ఎ తొలి టెస్టు డ్రా

by Phanindra |

పడిక్కల్, జురెల్ భారీ శతకాలతో చెలరేగారు. దీంతో భారత్-ఎ, ఆసీస్-ఎ మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది.

పడిక్కల్, జురెల్ భారీ శతకాలు.. భారత్-ఎ, ఆసీస్-ఎ తొలి టెస్టు డ్రా
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా యంగ్ క్రికెటర్ దేవదత్ పడిక్కల్ (150) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనధికారిక టెస్టులో భారత కుర్రాళ్లు పట్టుదల ప్రదర్శించారు. లక్నో వేదికగా జరిగిన ఈ టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆసీస్-ఎ జట్టు 532/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. బదులుగా ధ్రువ్ జురెల్ (140), పడిక్కల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. వీళ్లతోపాటు అభిమన్యు ఈశ్వరన్ (44), నారాయణ్ జగదీశన్ (64), సాయి సుదర్శన్ (73) కూడా రాణించారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్సులో 531/7 పరుగులకు డిక్లేర్ చేసింది.

ఆసీస్ బౌలర్లలో కోరీ రోచిషియోలీ మూడు వికెట్లతో రాణించాడు. అనంతరం మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్-ఎ జట్టు ఓపెనర్లు శామ్ కొన్‌స్టాస్ (27), కాంప్‌బెల్ కెల్లావే (24) వికెట్ పడకుండా జాగ్రత్తగా మ్యాచ్ ముగించారు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో ఆసీస్-ఎ 56/0 పరుగులు చేసింది. దీంతో ఆసీస్-ఎ, ఇండియా-ఎ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది.

Next Story