అరంగేట్రం మ్యాచులోనే విద్వంసం.. 34 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ నమోదు

by Malleboina Mahesh |

అరంగేట్రం మ్యాచులోనే దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ విధ్వంసం సృష్టించి చరిత్రలో నిలిచాడు.

అరంగేట్రం మ్యాచులోనే విద్వంసం.. 34 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: అరంగేట్రం మ్యాచులోనే దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ (Viaan Mulder) విధ్వంసం సృష్టించి చరిత్రలో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో తన అరంగేట్రం కెప్టెన్సీలో వియాన్ ముల్డర్ ట్రిపుల్ సెంచరీ (Triple century) సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగింది. ముల్డర్ 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. గతంలో భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతుల్లో) ఈ ఘనత సాధించగా.. వియాన్ ముల్డర్ ఇప్పుడు రెండో స్థానంలో నిలిచాడు.

ఈ మ్యాచులో ముల్డర్ 364 పరుగుల చేయగా దక్షిణాఫ్రికా (South Africa) తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. హాషిమ్ ఆమ్లా (311 పరుగులు, 2012) రికార్డును అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 34 ఫోర్లు, 3 సిక్సర్లతో విజృంభించాడు. ఈ ప్రదర్శనతో బ్రియాన్ లారా 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా ప్రమాదంలో పడగా.. ఎవరూ ఊహించని విధంగా.. 626 పరుగుల వద్ద సౌతాఫ్రికా జట్టు డిక్లేర్ ప్రకటించింది. దీంతో వియాన్ ముల్డర్ 367 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచిపోయాడు.

Next Story