Denmark Open: వరల్డ్ నం.2కు షాకిచ్చిన లక్ష్యసేన్

by Harish |

డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ అదరగొట్టాడు.

Denmark Open: వరల్డ్ నం.2కు షాకిచ్చిన లక్ష్యసేన్
X

దిశ, స్పోర్ట్స్ : డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ అదరగొట్టాడు. రెండో రౌండ్‌లో వరల్డ్ నం.2కు షాకిచ్చాడు. ఆ విజయంతో క్వార్టర్ ఫైనల్స్‌‌కు కూడా దూసుకెళ్లాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో సేన్ 21-13, 21-14 తేడాతో తన కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన డెన్మార్క్ ప్లేయర్ ఆంటోన్సెన్‌ను చిత్తు చేశాడు. గతేడాది ఆంటోన్సెన్ చేతిలో సేన్ రెండు సార్లు ఓడిపోయాడు. కానీ, ఈ సారి వరల్డ్ నం.2 ప్లేయర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. 53 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సేన్‌కు ఆంటోన్సెన్ పోటీ ఇవ్వలేకపోయాడు. రెండో గేములో ఒక దశలో 13-12తో ఒక్క పాయింట్ లీడ్ సాధించినప్పటికీ ఆ వెంటనే సేన్ బలంగా పుంజుకున్నాడు. వరుసగా 7 పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

మరోవైపు, పురుషుల డబుల్స్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన లీ జే హుయ్-యాంగ్ పో హ్సువాన్ జోడీపై 21-19, 21-17 తేడాతో భారత జంట గెలుపొందింది. ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదరవడంతో సాత్విక్ జోడీ చెమటోడ్చాల్సి వచ్చింది. అయినప్పటికీ ఎలాంటి తప్పిదాలు చేయకుండా వరుస గేముల్లోనే మ్యాచ్‌ను ముగించింది.


Next Story