టాస్ గెలిచిన ఢిల్లీ...ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-04-29 13:43:51  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కత్తా

టాస్ గెలిచిన ఢిల్లీ...ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు ( KKR ) తలపడబోతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇందులో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ టాస్ గెలవడంతో కేకేఆర్.. మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మొన్న కూడా బెంగళూరు పైన మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ తెలివిగా బౌలింగ్ చేయనుంది. సొంతగడ్డ కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అటు కేకేఆర్ ఇవాల్టి మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలి. లేకపోతే ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ : రహ్మానుల్లా గుర్బాజ్ (w), సునీల్ నరైన్, అజింక్యా రహానే (C), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ : ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(w), కరుణ్ నాయర్, KL రాహుల్, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్

Next Story