- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20 వరల్డ్ కప్.. టీమిండియాకు భారీ షాక్
దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ పై

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ పై కన్నేసింది. అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. టీ20 వరల్డ్ కప్ ను సాధించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ బౌలర్ దీపక్ చాహర్ టీ20 వరల్డ్ కప్ కు దూరం కానున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమైన అతడు.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
అయితే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వెన్నెముకకు గాయమైంది. దీంతో నాలుగు నెలల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఈ కారణంతో అక్టోబర్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు చాహర్ దూరమయ్యే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ ట్రాక్ పిచ్‌లపై మంచి బౌలింగ్ చేయగల అనుభవం చాహర్‌కు ఉంది. ఇప్పుడు అతడు దూరమైతే టీమిండియాకు ఎదురుదెబ్బే.
- Tags
- T20






