- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాతృభూమిపై మమకారం.. ఆ దేశ పౌరసత్వాలను తిరస్కరించిన రషీద్ ఖాన్!
అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వ ప్రతిపాదనలను స్పిన్ మాంత్రికుడు సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రఖ్యాత స్పిన్నర్, అఫ్గానిస్థాన్ (Afghanistan) దిగ్గజ ప్లేయర్ రషీద్ ఖాన్ (Rashid Khan) తన దేశభక్తిని చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న ఈ స్పిన్ మాంత్రికుడు, ఇతర దేశాల పౌరసత్వం (Citizenship) తీసుకోవాలనే ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించారు. భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) దేశాల పౌరసత్వం తీసుకుంటే కెరీర్ పరంగా మరిన్ని అవకాశాలు, వెసులుబాట్లు ఉంటాయని తెలిసినప్పటికీ, ఆయన తన మాతృభూమి అఫ్గానిస్థాన్‌కే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే, రషీద్ ఖాన్‌కు భారత్ లేదా ఆస్ట్రేలియా పౌరసత్వం ఇస్తామనే ప్రతిపాదనలు వచ్చినట్లుగా సమాచారం. అయితే, తాను ఎప్పటికీ అఫ్గాన్ క్రికెటర్‌గానే గుర్తించబడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తనుకు అత్యంత గర్వకారణమని పేర్కొన్నాడు. ఎన్ని ఆఫర్లు వచ్చినా తాను అఫ్గానిస్థాన్ క్రికెటర్‌గానే కొనసాగుతానని రషీద్ స్పష్టం చేశారు.
అఫ్గానిస్థాన్ ప్రస్తుతం క్రికెట్ పరంగా, రాజకీయంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో రషీద్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ ప్రజలు, అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ (IPL), బిగ్ బాష్ (BBL) వంటి లీగ్స్‌లో కీలక ఆటగాడిగా ఉన్న రషీద్ ఖాన్, తన మూలాలను వదులుకోనని చెప్పడంపై క్రికెట్ ప్రేమికులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.






