- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల డెడ్ బాడీలు లభ్యం
by Sathputhe Rajesh |
బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది.

X
దిశ, నేషనల్ బ్యూరో : బుల్లెట్ గాయాలతో ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. ఈ ఘటన జమ్ము కశ్మీర్ ఉదమ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఇద్దరు పోలీసు అధికారులు ఉత్తర కశ్మీర్‌లోని సొపోరు నుంచి రైసి జిల్లా తల్వారిలోని సబ్సిడరీ ట్రైనింగ్ సెంటర్‌కు వెళ్తున్నారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఉదమ్‌పూర్ రెహంబుల్‌లోని కాళీమాత ఆలయం వద్ద పోలీసు వ్యాన్‌లో బుల్లెట్ గాయాలతో అనుమానాస్పదంగా పడి ఉన్న డెడ్ బాడీలను గుర్తించాం. వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించాం. ప్రాథమిక విచారణలో ఓ పోలీసు అధికారి మరో అధికారిని కాల్చి అనంతరం సూసైడ్ చేసుకున్నట్లు తేలింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం.’ అని తెలిపారు.
Next Story






