- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డారిల్ మిచెల్ సెంచరీ మిస్..భారత్ ముందు భారీ లక్ష్యం, ఎంతంటే
నిర్ణీత 50 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్, 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో ఈ స్థాయిలో స్కోర్ చేయగలిగింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ వన్డే సిరీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్, 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో ఈ స్థాయిలో స్కోర్ చేయగలిగింది.
ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో వచ్చిన డారిల్ మిచెల్ ( Daryl Mitchell) సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ 84 పరుగులతో రాణించాడు. అటు కాన్వే 56 పరుగులు చేయగా హెన్రీ నికోల్స్ 62 పరుగులతో రఫ్పాడించాడు. ఇక ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో 301 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది. అటు భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ట తలో రెండు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.






