US Open : క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన రష్యా టెన్నిస్ ప్లేయర్.. రూ. 37 లక్షలు జరిమానా వేసిన నిర్వాహకులు

by Harish |

రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్ డానియల్ మెద్వెదెవ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు.

US Open : క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన రష్యా టెన్నిస్ ప్లేయర్.. రూ. 37 లక్షలు జరిమానా వేసిన నిర్వాహకులు
X

దిశ, స్పోర్ట్స్ : రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్ డానియల్ మెద్వెదెవ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. ఫ్రాన్స్ ప్లేయర్ బెంజమిన్ బోంజి చేతిలో 6-3, 7-5, 7-6(7-5), 6-0, 4-6 తేడాతో ఓడిపోయాడు. దీంతో సహనం కోల్పోయిన అతను తన రాకెట్‌ను విరగ్గొట్టాడు. అంతుకుముందు మ్యాచ్‌లోనూ మెద్వెదెవ్ క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించాడు. చైర్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీన్ని తప్పుబట్టిన ప్రేక్షకులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్యకరమైన సైగలు చేశాడు. మెద్వెదెవ్ ప్రవర్తనపై టెన్నిస్ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే యూఎస్ నిర్వాహకులు అతనిపై చర్యలు చేపట్టారు. భారీ జరిమానా విధించారు. 42 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.37 లక్షలు ఫైన్ పడింది. అందులో క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించినందుకు 30 వేల డాలర్లు, రాకెట్‌ను విరగ్గొట్టినందుకు 12,500 డాలర్లు జరిమానా విధించారు. తొలి రౌండ్‌లో నిష్ర్కమించడంతో మెద్వెదెవ్‌కు ప్రైజ్‌మనీ రూపంలో దాదాపు రూ. 96 లక్షలు అందుతాయి. ఆ మొత్తంలో జరిమానా రూపంలో మూడో వంతు కంటే ఎక్కువే మెద్వెదెవ్ నష్టపోనున్నాడు.


Next Story