Dale Steyn: లైవ్ లోనే బోరున ఏడ్చేసిన డేంజర్ బౌలర్

by velandi.Saikiran |

27 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీ ట్రోఫీ గెలవడంపై... ఆ జట్టు మాజీ డేంజర్ బౌలర్ డేల్ స్టెయిన్ ( Dale

Dale Steyn: లైవ్ లోనే బోరున ఏడ్చేసిన డేంజర్ బౌలర్
X

దిశ, వెబ్ డెస్క్: 27 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీ ట్రోఫీ గెలవడంపై... ఆ జట్టు మాజీ డేంజర్ బౌలర్ డేల్ స్టెయిన్ ( Dale Steyn) చాలా ఎమోషనల్ అయ్యారు. లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు బౌలర్ డేల్ స్టెయిన్. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ( ICC World Test Championship Final) మ్యాచ్ లో రెండు రోజుల కిందట దక్షిణాఫ్రికా జట్టు ( South Africa) విజయం సాధించిన సంగతి తెలిసిందే.

లార్డ్స్ లోని ( Lords ) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా ( Australia) వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సఫారీలు... చాంపియన్స్ గా నిలిచారు. దింతో WTC -2025 టోర్నమెంట్ ను గెలుచుకున్నారు దక్షిణాఫ్రికా ప్లేయర్లు. 1998 తర్వాత... ఐసీసీ టోర్నమెంట్ గెలవడానికి 27 సంవత్సరాలు దక్షిణాఫ్రికాకు పట్టింది. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికాలో.. సంబరాలు అంబరాన్ని అంటాయి.

అయితే ఈ విజయం నమోదు అయిన నేపథ్యంలో... ఆ జట్టు మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ ( Dale Steyn) ఎమోషనల్ అయ్యారు. దక్షిణాఫ్రికా విజయాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్ గెలిచే సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని... అదొక గొప్ప క్షణం అంటూ లైవ్ వీడియోలో ఎమోషనల్ అయ్యారు. ఛాంపియన్ గా నిలవడం చాలా గర్వంగా ఉందని... తన టెస్టు క్యాప్ ను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో డేల్ స్టెయిన్ వీడియో వైరల్ గా మారంది.

Twitter link

Next Story